Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
This Italian Town Could Fine Tourists $300 For Taking Selfies: ఏదైనా ఒక అందమైన ప్రాంతం కనిపిస్తే చాలు.. ఫోటో ప్రియులు వెంటనే అక్కడ ఫోటోలు క్లిక్‌మనిపిస్తారు. తమకున్న ఫోటోగ్రఫీ స్కిల్స్ మొత్తం వాడేసి, రకరకాలుగా ఆ ప్రాంతంలో ఫోటోలు దిగి.. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇక టూరిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఫోటోలు దిగడం కోసమే ఆయా అందమైన ప్రదేశాలను సెలెక్ట్ చేసుకొని మరీ వెళ్తుంటారు. కానీ.. ఇటలీలోని పోర్టోఫినో పట్టణానికి విహారయాత్రకు వెళ్లాలనుకుంటే మాత్రం.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే బెటర్. ఎందుకటే.. అక్కడి సుందరమైన దృశ్యాల వద్ద సెల్ఫీలు గానీ, ఫొటోలు గానీ దిగడం కుదరదు. ఈమేరకు అక్కడ ఫోటోలు దిగడాన్ని నిషేధం విధిస్తూ.. పట్టణం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Vinay Bhaskar: అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఇటలీలో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాలలో పోర్టోఫినో ప్రాంతం ఒకటి. అక్కడి జనాభా కేవలం 500 మంది మాత్రమే. సెలవుల్లో మరీ ముఖ్యంగా.. వేసవి కాలంలో వేలాదిమంది పర్యాటకులు ఆ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. కనులవిందుగా ఉండే అందమైన ప్రదేశం కావడంతో.. అక్కడ సెల్ఫీలు, ఫోటోలు దిగే నెపంతో ఒకే చోట ఎక్కువ మంది జనం గుమిగూడుతున్నారు. దీంతో.. ఈ ప్రాంతమంతా రద్దీగా తయారవుతుంది. దీంతో.. స్థానిక కార్యకలాపాలు కొనసాగించడం ఇబ్బందికరంగా మారింది. ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించిపోతుండటంతో.. గందరగోళ వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే.. ఫోర్టోఫినోలో రద్దీని తగ్గించడం కోసం, అక్కడి అధికారులు కొన్ని నిబంధనలు విధించారు. వాటిల్లో.. ఫోటోలు దిగడాన్ని బ్యాన్ చేసింది. పర్యాటకులు ఎవరూ సెల్ఫీలు దిగకుండా.. నో-వెయిటింగ్ జోన్‌ను ప్రవేశపెట్టింది.
Singer Sunitha: సింగర్ సునీత భర్తకు ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు
ఒకవేళ ఎవరైనా నిబంధనల్ని అతక్రమించి సెల్పీలు గానీ, ఫోటోలు గానీ తీస్తే.. 275 యూరోల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.25 వేలు) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈస్టర్ వారాంతం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 వరకు వర్తిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఈ నియమాలు అమల్లో ఉండనున్నాయి. ఈ వ్యవహారంపై ఫోర్టోఫినో మేయర్ మాటియో వయాకావా మాట్లాడుతూ.. ఫోటోలు దిగేందుకు జనాలు ఒకేచోట గుమిగూడడం వల్ల వీధుల్లో గంటల తరబడి ట్రాపిక్ స్తంభించిపోతోంది. దీంతో గందరగోళం నెలకొంటోంది. దానికి పర్యాటకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ఆయన.. భద్రతా చర్యల దృష్ట్యా సెల్ఫీలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..