పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రేపు అన్ని నియోజకవర్గాల్లో బీఆరెస్ ప్రతినిధుల సభలు నిర్వహిస్తామని వెల్లడించారు చీఫ్ విప్ వినయ్ భాస్కర్. ఇవాళ ఆయన హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు 3500 మంది ప్రతినిధులతో మడికొండ సత్యసాయి కన్వెన్షన్ సెంటర్ లో సభ ఉంటుందని తెలిపారు. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చ, వివిధ తీర్మానాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ పై తీర్మానాలు చేస్తామని, దొంగే దొంగ దొంగ అన్నట్టు.. బీజేపీ నాయకులు, అమిత్ షా అనేక అబద్ధాలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : JC Diwakar Reddy: జేసీ సంచలనం.. సీమను తెలంగాణలో కలపాల్సిందే..!
అమిత్ షా.. ఒక అబద్ధాల షా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ ఉనికిని చాటుకోవడానికే ఇక్కడికి వస్తున్నారని, దేశంలో కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్ర నేతల కుర్చీలు కదులుతున్నాయనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కృషి చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని, అమిత్ షా, మోడీ పతనం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కేసీఆర్ నేతృత్వంలో పార్టీ కీలకంగా వ్యవహరిస్తుందని, విభజన హామీల్లో భాగంగా కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ అడిగామన్నారు. రైల్వే వాళ్ళు అడిగినంత స్థలం ఇచ్చామని, 10 ఎకరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారన్నారు. రైతులకు పరిహారం ఇచ్చి రైల్వే కు స్థలం అప్పగించామన్నారు. బీజేపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
Also Read : Harish Rao: ఓటమి తప్పదు.. అందుకే అమిత్ షా ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడారు..