2019లో చైనాలో మొదలైన కరోనా ఆ తరువాత మహమ్మారిగా మారి ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సిన్‌ను వేగవంతం చేశాయి. అయితే, ఫైజర్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్-అస్త్రాజెనకా టీకాలు కొంత ఖరీదుతో కూడుకొని ఉన్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు చైనా రెండు రకాల వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్నది.
Read: కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా పేరేమిటంటే…?
ఈ రెండు రకాల వ్యాక్సిన్లను 90 దేశాలకు ఎగుమతి చేస్తున్నది. తక్కువ ధరకు ఈ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మంగోలియా, సీషెల్స్, బహ్రెయిన్ వంటి దేశాలు చైనా వ్యాక్సిన్లను ఎక్కువగా కొనుగోలు చేశాయి. అయితే, ఆయా దేశాల్లో వ్యాక్సిన్ వేసిన తరువాత కేసులు తగ్గకపోగా, పెరగడం మొదలుపెట్టాయి. దీంతో ఆయా దేశాలు ఆందోళనలు చెందుతున్నాయి.