కంబోడియా-థాయ్లాండ్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవలే ట్రంప్ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చేశారు. మళ్లీ ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కంబోడియాపై థాయ్లాండ్ వైమానిక దాడులు చేసింది. దీంతో మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
కంబోడియా సరిహద్దులో వైమానిక దాడులు ప్రారంభించినట్లు థాయ్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ వింథాయ్ సువారీ సోమవారం తెలిపారు. ఇరు దేశాలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రస్తుతం కంబోడియాపై థాయ్లాండ్ వైమానిక దాడులు చేస్తోంది. మళ్లీ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.
జూలైలో థాయ్లాండ్-కంబోడియా మధ్య 5 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితులు చేదాటడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం పుచ్చుకుని శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిత్వం వహించడంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించారు. అనంతరం అక్టోబర్లో కౌలాలంపూర్లో ట్రంప్ ఆధ్వర్యంలో రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. అప్పటి నుంచి పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.