థాయ్‌లాండ్-కంబోడియా మధ్య మరోసారి శాంతి ఒప్పందం జరిగింది. గత 20 రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్ పడింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.
కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవలే ట్రంప్ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చేశారు. మళ్లీ ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు భీకరదాడులు చేసుకుంటున్నాయి. ఇక కంబోడియా జరిపిన దాడుల్లో చిన్నారి సహా తొమ్మిది మంది థాయ్‌లాండ్ పౌరులు మరణించారు.