Tarique Rahman: ప్రవాసం నుంచి ప్రధాని దాకా.. తారిఖ్ రెహ్మాన్ నేపథ్యం ఇదే..
- ప్రవాసం నుంచి ప్రధాని పదవి దాకా..
- 17 ఏళ్ల ప్రవాసం తర్వాత బంగ్లా ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 18 నెలల పాటు కొనసాగిన అనిశ్చితి తొలిగిపోయింది. ఎట్టకేలకు ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం కొలువుదీరనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి జమాతే ఇస్లామీతో పోలిస్తే పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకుంది. బంగ్లా దశాదిశను మార్చే ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ ప్రధాని కాబోతున్నారు. 60 ఏళ్ల తారిఖ్ రెహ్మాన్ 17 ఏళ్ల పాటు యూకేలో ప్రవాసంలో జీవించి, సొంత దేశానికి వచ్చిన నెలల్లోనే అత్యున్నత పదవిని అధిష్టించనున్నారు. ఆయన పోటీ చేసిన ఢాకా-17, బొగురా-6 స్థానాల నుంచి గెలిచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. బీఎన్పీ ఈ ఎన్నికల్లో 300 స్థానాలకు గానూ 292 స్థానాల్లో పోటీ చేసింది. దాదాపుగా 209 స్థానాల్లో విజయం సాధించింది.
Read Also: AUS vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాంబ్వే విజయం!
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
తారిఖ్ రెహ్మాన్ ఎవరు..?
తారిఖ్ రెహ్మాన్ ఆర్మీ అధికారి జియాఉర్ రెహ్మాన్, మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన ఖలీదా జియా పెద్ద కుమారుడు. 2001-2006 మధ్య బీఎన్పీ-జమాత్ సంకీర్ణ ప్రభుత్వంలో ‘‘డార్క్ ప్రిన్స్’’గా పిలిచేవారు. ఆయన బంగ్లాదేశ్‌లో ‘‘షాడో పీఎం’’గా పనిచేశారు. 2007లో కేర్ టేకర్ ప్రభుత్వంలో అరెస్టై 17 నెలలు జైల్లో గడిపాడు. పలు కేసులు ఇతడిపై ఉన్నాయి. మనీలాండరింగ్, హసీనా హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో దోషిగా నిర్ధారించబడ్డారు. కస్టడీలో హింసిస్తున్నారని, వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లాడు. అప్పటి నుంచి 17 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు. ఈ ఏడాది ఖలీదా జియా మరణించిన తర్వాత ఈయన బీఎన్పీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, 2024 ఆగస్టులో భారత్ వచ్చారు. ఈ పరిణామం తర్వాత తారిఖ్ రెహ్మాన్ శకం మొదలైంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు ప్రధాని కాబోతున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!