సోమాలియాలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల కొద్ది క్షతగాత్రులుగా మారిపోయారు.
సోమాలియా రాజధాని మొగదీషులోని ప్రముఖ లిడో బీచ్‌లో పర్యాటకులు ఆనందంగా గడుపుతున్నారు. ఇంతలో ఆల్‌ఖైదా గ్రూప్‌నకు సంబంధించిన అల్-షబాబ్ సంస్థకు చెందిన ఒకరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. బీచ్‌కు ఆనుకుని ఉన్న రెస్టారెంట్‌పై దాడి చేయగా.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 63 మంది గాయాలు పాలయ్యారు. ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొనగా.. ఒకరు దాడిలో చనిపోగా.. మరో ఐదుగురిని భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. భారీ జనసమూహం మధ్య దాడి చేయడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇదిలా ఉంటే పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాడి చేసింది తామేనని అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Gottipati Ravi Kumar: విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడతాం.. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్..