Kamikaze Drones: యుద్ధరంగంలో కీలకంగా మారబోతున్న కామికేజ్ డ్రోన్‌లను భారతదేశం ఆవిష్కరించింది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ, స్వదేశీ ఇంజిన్‌తో తయారవుతున్న ఈ ఆత్మాహుతి డ్రోన్‌లను నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్(NAL) తయారు చేస్తున్నట్లు తెలిపింది. మానవరహిత ఈ వైమానికి విమానాలు 1000 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణించి శత్రువుల లక్ష్యాలపై దాడులు చేయగలవు. గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ, 120 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు.
Read Also: TRAI: స్పామ్ కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశాలు..
యుద్ధ రంగంలో ఈ డ్రోన్‌లు గేమ్ ఛేంజర్లుగా మారబోతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఈ డ్రోన్లు విరివిగా ఉపయోగించారు. రష్యన్ పదాతిదళాలను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ ఈ డ్రోన్లు ప్రయోగించింది. ఈ యుద్ధంలో ఇవి మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. రిమోట్ కంట్రోల్‌తో దీనిని నియంత్రిస్తూ లక్ష్యాలపై దాడులు చేయించవచ్చు. ఒకేసారి అనేక డ్రోన్లను ప్రయోగించి, రాడార్లు, శత్రువుల రక్షణ వ్యవస్థను అధిగమించి దాడులు చేయగలవు. కామికేజ్ ఆత్మాహుతి మిషన్లు మొదటి ప్రపంచ యుద్ధం-2 ముగింపులో కనిపించాయి. జపాన్ వైమానికదళం క్షీణించిన తర్వాత వారి పైలట్లు వారి యుద్ధవిమానాలను అమెరికా దాని మిత్రరాజ్యాల విమానాలు, నౌకలపైకి సూసైడ్ మిషన్లుగా దాడులకు పాల్పడ్డాయి.
భారత కామికేజ్ డ్రోన్లు 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు రెక్కుల కలిగి ఉంలాయి. ఒకసారి ఆకాశంలోకి వెళ్తే 9 గంటల వరకు ప్రయాణించగలవు. నిర్దిష్టమైన లక్ష్యాలపై నిఘాతో పాటు వీటిని క్రాష్ చేసి దాడులు చేయవచ్చు. ఇండియన్ కామికేజ్ డ్రోన్ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన 30-హార్స్ పవర్ ఇంజన్ దీనికి ఉపయోగిస్తున్నారు. ఇది భారత నావిగేషన్ వ్యవస్థ NAViCని ఉపయోగించవచ్చు.