బంగ్లాదేశ్ ప్రజలకు మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక సందేశం పంపించారు. ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా.. గంభీరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తన దేశస్థులకు విజ్ఞప్తి చేశారు. బంగబంధు భాబన్‌లో పూల దండలు సమర్పించి ప్రార్థించాలని కోరారు.
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది.. పరువు పోతుందని కుటుంబం మొత్తం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోలార్ గ్రామానికి చెందిన ఒక యువతి , యువకుడు ప్రేమించుకున్నారు.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని తెలిసి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచారు. అంతలోనే ఆ యువతి గర్భం దాల్చింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే చంపేస్తారని చదువు పేరిట బయటికి వెళ్లి బిడ్డ పుట్టాకా ఇంటికి చేరుకుంది యువతి. అయితే ఆ బిడ్డను పుష్ప…