Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
- యూఎన్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగం
- ఆపరేషన్ సిందూర్‌పై పిచ్చి వాగుడు
- నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐక్యరాజ్యసమితి వేదికగా ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అవాకులు చెవాకులు ప్రేలారు. 2025 మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై విజయం సాధించినట్లుగా పిచ్చి వాగుడు వాగారు. తమ సైన్యం విజయం సాధించిందన్నారు.. ఈ సందర్భంగా సైన్యంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న భారత దౌత్యవేత్త ఆర్.శ్రీనివాస్ నవ్వుతూ.. తల ఊపుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2025 మేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం చోటుచేసుకున్న సైనిక ఘర్షణను షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ సాయుధ దళాలు “ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో” స్పందించాయని పేర్కొన్నారు. భారత దాడిని తిప్పికొట్టి, శత్రువుకు గుణపాఠం చెప్పామని వ్యాఖ్యానించారు. ఇక భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణలు మరింత విస్తరించకుండా ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన జోక్యాన్ని కూడా షెహబాజ్ ప్రశంసించారు. రెండు అణ్వాయుధ దేశాలు పూర్తిస్థాయి యుద్ధానికి చేరువైన సమయంలో ట్రంప్ “సమయోచిత జోక్యం” చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. ఈ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని కొట్టిపారేసింది.
Also Read
- Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
- Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
- Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ఇక సింధు జలాల ఒప్పందాన్ని కూడా ప్రస్తావించారు. పాకిస్థాన్‌కు దక్కాల్సిన సింధు నది నీటిని ఆపడం, అడ్డుకోవడం లేదా మళ్లించేందుకు ప్రయత్నిస్తే దాన్ని “యాక్ట్ ఆఫ్ వార్”గా పరిగణిస్తామని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. దీనిపై భారత్ ఐక్యరాజ్యసమితిలో ‘రైట్ ఆఫ్ రిప్లై’ వినియోగించి స్పందించింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పేటల్ గహ్లోత్.. పాకిస్థాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ.. ఉగ్రవాదంపై భారత్ తనను తాను రక్షించుకునే హక్కును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ భారత్‌లో “అంతర్భాగం, విడదీయరాని భాగం” అనే తమ వైఖరిని గహ్లోత్ మరోసారి పునరుద్ఘాటించారు. కశ్మీర్ గురించి మాట్లాడాల్సి వస్తే పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ పరిస్థితిపై దృష్టి పెట్టాలని ఆమె పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని ప్రసంగంలో చేసిన ఉగ్రవాదం, కశ్మీర్, ప్రజాస్వామ్య హక్కులు, మైనారిటీలకు సంబంధించిన వ్యాఖ్యలపై కూడా గహ్లోత్ స్పందించారు. పాకిస్థాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదానికి పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం.. మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Indian diplomat R. Srinivas burst into laughter as Pakistan PM Shehbaz Sharif begins claiming victory during the May 2025 conflict 😂🤣 https://t.co/gKyOa08fzP
— News Algebra (@NewsAlgebraIND) September 25, 2026
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?