Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
- 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్తాన్..
- గోల్డ్‌మన్ శాక్ అంచనాల నేపథ్యంలో పాక్ ప్రధాని షరీఫ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shehbaz Sharif: పేదరికం, తీవ్ర అప్పుల భారం, అంతర్గత సంక్షోభం మధ్య పాకిస్తాన్ భారీ లక్ష్యాన్నే పెట్టుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) నుంచి తదుపరి విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్.. 2050 నాటికి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధీమా వ్యక్తం చేశారు. 2022లో గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ 2075 నాటికి పాకిస్తాన్ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది. అయితే, ఈ అంచనాలను పాక్ 2050 కన్నా ముందే చేరుకుంటుందని పాక్ ప్రధాని చెప్పారు.
రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం జరిగిన పాకిస్తాన్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోల్డ్‌మన్ శాక్స్ అంచనాను ప్రస్తావిస్తూ.. “ఇక్కడ నేను ఒక చిన్న సవరణ చేయాలనుకుంటున్నాను” అని అన్నారు. 2075 నాటికి కాకుండా, 2050కు ముందే పాకిస్థాన్ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Mississippi River Accident : మిసిసిపీ నదిలో పెను ప్రమాదం.. క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ట్యాంకర్
- Ukraine Peace Deal: డాన్బాస్ కావాలా.. NATO సభ్యత్వమా? ఉక్రెయిన్ ముందు అమెరికా ప్రతిపాదన!
- Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
- Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
ఇదిలా ఉంటే, లక్ష్యం పెద్దదిగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆ టార్గెట్ చేరుకుంటుందా అనేదానిపై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ అప్పుల భారం, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మరోవైపు, ఐఎంఎఫ్ నుంచి 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,000 కోట్ల) నిధుల ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.
ఖనిజాలపై షరీఫ్ ఆశలు..
పాకిస్తాన్ ఆర్థిక వృద్ధికి ఖనిజ సందప దోహదపడుతుందని పాక్ ప్రధాని భావిస్తున్నారు. దేశంలో తవ్విన ఖనిజాలను ముడి సరుకుగా వేరే ప్రాంతాలకు ఎగుమతి చేయకుండా, దేశంలోనే శుద్ధి చేసి పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చాలని పెట్టుబడిదారుల్ని కోరారు. బలూచిస్తాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రాగి, బంగారు ఖనిజాల నిక్షేపాలు ఉన్నట్లు షరీఫ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గోల్డ్‌మన్ శాక్స్ ఏం అంచనా వేసింది.?
గోల్డ్‌మన్ శాక్స్ 2022లో విడుదల చేసిన అధ్యయనం 104 దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలించింది. ఈ అంచనాల ప్రకారం, 2075 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా, నైజీరియా తొలి ఐదు స్థానాల్లో ఉంటాయని, పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉండొచ్చని అంచనా వేసింది. ఇది నిజమైతే పాకిస్తా్న్ వాస్తవ జీడీపీ 12.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని, తలసరి జీడీపీ 27,100 డాలర్లుగా అంచనా వేసింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
-
Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
-
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
-
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
-
Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!