అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఫ్లోరిడా యూనివర్సిటీ రక్తసిక్తమైంది. మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. నిందితుడిని చాకచాక్యంగా పట్టుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు.శుక్రవారం తెల్లవారుజామున 1:07 గంటలకు హాలోవీన్ వేడుకల సందర్భంగా సామూహిక కాల్పులు జరిగాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ నైట్‌క్లబ్ దగ్గర దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో 13 మంది గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చర్చి స్ట్రీట్‌లో ఉన్న నైట్‌క్లబ్ దగ్గర కాల్పులు జరిగాయి.
Czech Republic: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రేగ్ నగరంలోని ఓ యూనివర్సిటీల్లో దుండగుడు సామూహిక కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు మరణించగా.. చాలా మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య, వివరాలను చెక్ పోలీసులు ప్రకటించలేదు.
అమెరికాలో తుపాకీ సంస్కృతి మళ్లీ బుసలు కొట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ రోజున కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల్లోనే 8మంది దాకా ఈ తుపాకీ సంస్కృతికి బలయ్యారు. మరో 28మంది దాకా గాయపడ్డారు.
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికాలో ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.