India-Russia: భారత్ కు రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా రష్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా అనేక ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొనుగోలుపై పలు పాశ్చాత్య దేశాలు నిషేధాన్ని విధిస్తున్నాయి. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రష్యా నుంచి వైదొలుగుతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించినా ఉక్రెయిన్ పై దాడిని ఆపడం లేదు రష్యా.
ఇదిలా ఉంటే భారత్ కు అతి తక్కువ రేటుకే రష్య చమురును ఆఫర్ చేసింది. దీంతో ఇండియా కూడా రష్యా వద్ద నుంచి క్రూడ్ ఆయిన్ ను దిగుమతి చేసుకుంటోంది. ఒక సందర్భంలో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతిని కొన్ని పాశ్చత్య దేశాలు వ్యతిరేకించాయి. అయితే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యూరప్ కొనుగోలు చేస్తున్న దాని కన్నా అతి తక్కవ చమురునే కొనుగోలు చేస్తున్నామని కౌంటర్ ఇచ్చారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
తాజాగా మే నెలలో భారత్ కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రెండో అతిపెద్ద దేశంగా రష్యా నిలిచింది. అతి తక్కువ రేటుకే చమురును ఆఫర్ చేయడంతో భారత రిఫైనర్లు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. మే నెలలో భారత రిఫైనరీలు రోజుకు 819,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నాయి. భారత్ కు చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాక్ మొదటిస్థానంలో ఉండగా.. రష్యా రెండో స్థానంలో, సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉన్నాయి. మే నెలలో భారత్ కు దిగుమతి అయిన చమురులో రష్యా 16.5 వాటాను కలిగి ఉంది. మే నెలలో ఇండియా చమురు దిగుమతి మొత్తం 4.98 మిలియన్ బీపీడీ(బ్యారెల్స్ పర్ డే)గా ఉంది. 2020 డిసెంబర్ నుంచి ఇదే అధికం. మేనెలలో చమురు దిగుమతులు గత నెల కన్నా 5.6 శాతం పెరిగాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 19 శాతం అధికం.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..