ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది.. ఓవైపు శాంతి చర్చలు.. మరోవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి.. ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను కూడా వదలకుండా భీకరంగా విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా రష్యాను ఎదుర్కొంటోంది.. అయితే, ఇప్పుడు పరిస్థితి కాస్త రివర్స్ అయినట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తోంది.. తమ భూభాగంలో ఉక్రెయిన్ తొలి వైమానిక దాడి చేసిందని రష్యా చెబుతోంది.. బెల్గోరోడ్ నగరంలోని ఇంధన డిపోపై ఉక్రెయిన్ హెలికాప్టర్‌తో బాంబు దాడి చేసినట్టు పేర్కొంది రష్యా. ఇక, ఇది ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలకు ఆటకంగా హెచ్చరిస్తోంది రష్యా.
Read Also: AP: వైసీపీ కార్యకర్తలకు ప్రత్యేకం.. మూడు ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా..
ఇవాళ ఉదయం ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరోడ్‌లో ఉక్రెయిన్ దాడులు చేసినట్టు రష్యా చెబుతోంది.. తమ భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ ఆర్మీ హెలికాప్టర్.. అక్కడి పెట్రోల్ నిల్వ కేంద్రంపై బాంబు దాడులు చేసిందని ఆరోపించింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగసిపడినట్లు బెల్గోరోడ్ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ పేర్కొన్నారు. 170 ఫైర్ ఇంజిన్లు శ్రమించి మంటలను అదుపుచేసినట్లు వెల్లడించారు.. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు 37వ రోజుకు చేరుకోగా.. ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్‌ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ, ఇప్పుడు రష్యా భూభాగంలోకి వెళ్లి.. ఇంధన డిపోపై ఉక్రెయిన్ వైమానిక దాడి జరుపడం పెద్ద చర్చగా మారింది.