జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పాకిస్థాన్ చేసిన బహుళ క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ను భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఇస్లామాబాద్‌తో పాటు లాహోర్, సియాల్‌కోట్, కరాచీలో దాడులు నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా ఈ అంశంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈరోజు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి.…
పాకిస్థాన్ దుశ్చర్య తర్వాత భారత నావికాదళం రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ యుద్ధ బరిలోకి దిగింది. పాకిస్థాన్‌లో ప్రధాన నగరమైన కరాచీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ.. విధ్వంసం సృష్టిస్తోంది. ఈ దాడి అనంతరం కరాచీ ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భీకర దాడిలో కరాచీ నౌకాశ్రయం విధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఓడరేవుతో పాటు కరాచీ నగరంలోని పలు చోట్ల భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ భయాందోళనల్లో మునిగి పోయింది.…
భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌లో లోని ఉగ్ర శిబిరాలపై దళాల దాడులు చేసింది. పీఓకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసి మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇండియాన్ ఆర్మీకి అభినందలు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు నెటిజన్స్. అలాగే పలువురు…
పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపి కుటుంబాల్లో శోకాన్ని నింపిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రెడీ అయ్యింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత దళాలు వైమానిక దాడులు నిర్వహించి తిరిగి వచ్చాయి. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ప్రకటించాయి. అయితే పాకిస్తాన్‌లో భారత వైమానిక మొదటి దాడి జరిగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. Also…
Israel–Hezbollah conflict: ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత రోజే ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్‌పై దాడికి పాల్పడ్డాయి. రాకెట్ నిల్వ కేంద్రంలో హెజ్‌బొల్లా మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉండటాన్ని గమనించే తాము దాడి చేసినట్లు టెల్ అవీవ్ పేర్కొనింది.
Israel attack on Iran : దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్‌పై ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేసింది. శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ వేగంగా క్షిపణులను ప్రయోగించింది.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది.. ఓవైపు శాంతి చర్చలు.. మరోవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి.. ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను కూడా వదలకుండా భీకరంగా విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా రష్యాను ఎదుర్కొంటోంది.. అయితే, ఇప్పుడు పరిస్థితి కాస్త రివర్స్ అయినట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తోంది.. తమ భూభాగంలో ఉక్రెయిన్ తొలి వైమానిక దాడి చేసిందని రష్యా చెబుతోంది.. బెల్గోరోడ్…
గత కొంత కాలంగా తాలిబన్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘన్ ప్రభుత్వ దళాలలకు మధ్య పోరు జరుగుతున్నది. ఇప్పటికే తాలిబన్ ఉగ్రవాదులు కీలక ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకోవడంతో ఆయా ప్రాంతాల్లోని అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కంధర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో ఆఫ్ఘన్ రక్షణ దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. Read: భారత్ కు మరో ఒలంపిక్ మెడల్… ఈ వైమానిక…