Rishi Sunak Trolled For Wrong Spell In Campaign: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్.. ఓ చిన్న తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యారు. దీంతో నెటిజన్లు ఆయనపై సెటైర్ల వర్షం కురిపించారు. ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? అని అనుకుంటున్నారా! ఇటీవల టెలివిజన్ డిబేట్‌లో పాల్గొనప్పుడు.. రిషి తన ప్రచార బ్యానర్‌లో క్యాంపెయిన్ స్పెల్లింగ్‌ను తప్పుగా రాశారు. ఇంగ్లీష్‌లో P పక్కన I అక్షరాన్ని జోడించారు. అది చూసిన నెటిజన్లు.. వెంటనే ఆయనపై విరుచుకుపడ్డారు. ప్రధాని రేసులో ఉన్న ఓ బిలియనీర్‌కు.. కనీసం క్యాంపెయిన్ స్పెల్లింగ్ కూడా రాదా? అంటూ కామెంట్స్ చేశారు. ఫలితంగా.. గూగుల్ ట్రెండింగ్స్‌లో రిషి సునక్ పేరు ట్రెండ్ అయ్యింది.
ఒక చిన్న తప్పుకు తనపై వచ్చిన కామెంట్స్ చూసి.. రిషి సునక్ చాలా హుందాగా రియాక్ట్ అయ్యాడు. బ్రిటన్ ప్రధాని రేసులో భాగంగా తాను తెరతీసిన ‘రెడీ ఫర్ రిషి’ స్లోగన్ తరహాలోనే రెడీ ఫర్ స్పెల్‌చెక్ అంటూ రిప్లై ఇచ్చారు. అంటే.. తన తప్పును సరిదిద్దుకునేందుకు రెడీ అని ఆయన అభిప్రాయం. ఈ విధంగా రిషి సానుకూలంగా స్పందించడంతో.. నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ ఎంపీ కూడా స్పందిస్తూ.. తాను రిషికి మద్దతు ఇవ్వడానికి గల కారణం, సరైన నైపుణ్యాలు అనుభవంతో పాటు అతనో మంచి వ్యక్తి కావడమేనని అన్నారు. కాగా.. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి దూసుకుపోతున్నారు. తొలి రౌండ్‌లో రౌండ్‌లో నాలుగింట ఒక వంతు ఓట్లను సాధించిన ఆయన.. రెండో రౌండ్‌లో మూడు అంకెలకు పైగా ఓట్లు పొందిన ఏకైక వ్యక్తిగా నిలిచారు.