Army jawan, honey-trapped by two Pakistani women agents: భారతదేశాన్ని దెబ్బతీసేందుకు దాయాది దేశం పాకిస్తాన్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తోంది. దొంగదారిన భారత రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన సున్నిత సమాచారాన్ని సేకరించడానికి పాకిస్తాన్ గూఢాచార ఏజెన్సీ‘ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్’(ఐఎస్ఐ) తన ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఐఎస్ఐ వలపు వలకు భారత ఆర్మీకి చెందిన ఓ సైనికుడు చిక్కాడు. ఐఎస్ఐకి చెందిన ఇద్దరు మహిళా ఏజెంట్ల హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న భారత ఆర్మీ అతన్ని అరెస్ట్ చేసింది.
ఆర్మీ జవాన్ శాంతిమోయ్ రాణా ఇద్దరు మహిళలకు టచ్ లో ఉన్నాడని.. రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచమైన మహిళతో సంబంధాలు పెట్టుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఉమేష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం… ‘ ఆపరేషన్ సర్హద్’లో భాగంగా పాక్ గూఢాచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందని.. పశ్చిమ బెంగాల్ కు చెందిన బంకురాలోని కంచన్ పూర్ వాసి రాణా( 24) సదరు మహిళ ఏజెంట్లతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని సున్నితమైన సమాచారాన్ని అందించారని అన్నారు. హనీట్రాప్ ఆరోపణన నేపథ్యంలో రాణా ఎలాంటి సమాచారాన్ని పాకిస్తాన్ కు అందించారనే వివరాలను రాబట్టే పనిలో ఉంది ఆర్మీ. జూలై 25న రాణాలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Read Also: Rashtrapatni Comments: కాంగ్రెస్ లో రచ్చకు దారితీసిన” రాష్ట్రపత్ని” వ్యాఖ్యలు..
రాణా మార్చి 2018లో ఆర్మీలో చేరాడు. రాజస్థాన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. విచారణలో కీలక విషయాలను రాణా వెల్లడించారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో పనిచేస్తున్నట్లు చెప్పుకున్న మహిళ ఏజెంట్.. మొదట తన పెరును గర్నూర్ కౌర్ అలియాస్ అంకితగా.. యూపీలోని షాజహాన్ పూర్ నివాసిగా చెప్పుకుందని.. మరో ఐఎస్ఐ ఏజెంట్ నిషాతో కూడా రాణా సంప్రదింపులు నడిపారు. నిషా మిలిటరీ నర్సింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నట్లు చెప్పిందని.. రాణా అధికారులకు వెల్లడించారు. అతన్ని హనీ ట్రాప్ చేసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆర్మీకి సంబంధించిన రహస్య పత్రాలను , ఫోటోలను అడగటం ప్రారంభిచారని.. ఇంటలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్. సెంగతీర్ వెల్లడించారు.