UK PM Race- Rishi Sunak: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. ఎన్నికల్ ప్రచారంలో ఆకట్టుకునే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సునక్ మరోసారి బ్రిటన్ మహిళలకు, పిల్లలకు అండగా నిలుస్తానంటూ వాగ్ధానం చేశారు. దేశంలో హద్దులు మీరుతున్న గ్రూమింగ్ ముఠాల నిర్మూలిస్తానని..గ్రూమింగ్ ముఠాకు చెందిన వారికి జీవిత ఖైదు ఎదుర్కొంటారని..ప్రజలకు హామీ ఇచ్చారు