ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్‌ను నాటో కూటమిలోకి చేర్చుకోవాలన్న పాశ్చాత్య దేశాల వైఖరే ఈ సంక్షోభానికి అసలు కారణమని పుతిన్ తేల్చి చెప్పారు. ఆక్రమణతో పుట్టికొచ్చిన సంక్షోభం కాదని.. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు మద్దతు ఇవ్వడంతోనే ఈ యుద్ధం మొదలైందని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు భారత్-చైనా చేసిన కృషి అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలను పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యాంకోవిచ్‌ను గద్దె దింపడం వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని.. అదే యుద్ధానికి మూల కారణంగా చెప్పారు. అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన సంభాషణ వివరాలు.. జిన్‌పింగ్‌తో సహా ప్రపంచ నాయకులతో పంచుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Modi-Putin: ఒకే కారులో మోడీ-పుతిన్.. ఆసక్తిరేపుతోన్న ప్రయాణం
2022 నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతోంది. ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య ఆపేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. ప్రయోజనం లభించలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కూడా చర్చలు జరిపారు. అయితే పుతిన్ షరతులు విధించడంతో చర్చలు పురోగతి సాధించలేదు. ప్రస్తుతం శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది.
ఇది కూడా చదవండి: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
