Iran War: హార్ముజ్ వద్ద F-15 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్..
- ఇరాన్ భారీ ప్రకటన..
- ఎఫ్-15ను కూల్చేసినట్లు ప్రకటించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ భారీ ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలో శత్రవుకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఈ చర్య ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ పనితీరును ప్రతిబింబిస్తుంది. అధునాతన అమెరికన్ యుద్ధ విమానాన్ని ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించి క్షిపణి ద్వారా కూల్చేనట్లు చెబుతోంది. గగనతల రక్షణ వ్యవస్థ ఎఫ్-15ను లాక్ చేస్తున్నట్లు చూపిస్తున్న ఒక వీడియోను కూడా ఆ ఏజెన్సీ విడుదల చేసింది. అయితే, ఈ విషయాన్ని అమెరికా కానీ, ఇతర గల్ఫ్ దేశాలు ధ్రువీకరించలేదు.
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఈ యుద్ధం కారణంగా అమెరికా సైన్యం గణనీయమైన నష్టాన్ని చవిచూస్తోంది. నివేదిక ప్రకారం ఇప్పటి వరకు అమెరికా 17 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో 12 డ్రోన్లు, నాలుగు మానవ సహిత విమానాలు ఉన్నాయి. ఇందులో ఒక ఎఫ్-35 యుద్ధ విమానం దెబ్బతింది. గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఒక ఎఫ్-16 విమానాన్ని కూల్చేసిందనే వార్త వచ్చినప్పుడు అమెరికా దీనిని కొట్టిపారేసింది.
యూఎస్ ఇప్పటి వరకు ఎక్కువగా డ్రోన్లను నష్టపోయింది. 12 యూఎస్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌లను ఇరాన్ కూల్చేసింది. ఇది సుదూర నిఘా, ఖచ్చితమైన దాడుల కోసం ఉపయోగించే డ్రోన్. దీనికి హెల్‌ఫైర్ క్షిపణి అమర్చబడి ఉంటుంది. సుమారు 72 గంటల పాటు గాలిలో ఉండగలదు. ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన గాలిలో ఇంధనాన్ని నింపే విమానం కూడా కూలిపోయింది. ఇరాక్ గగనతలంలో దీనిని ఇరాన్ కూల్చేసింది. దీంట్లో ఆరుగురు సిబ్బంది మృతి చెందింది.
#BREAKING
An enemy's F-15 fighter jet was shot down by Iranian air defense systems near Hormuz Island after being intercepted over the country’s southern coast. pic.twitter.com/jmrFuUQKbd— Tehran Times (@TehranTimes79) March 22, 2026
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!