Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill on 405-Run Target: బుధవారం వెస్టిండీస్‌తో గువాహటిలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ డబుల్ సెంచరీ (133 బంతుల్లో 223 పరుగులు)తో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ తన ఇన్నింగ్స్, భారత్ భారీ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. స్కోర్ బోర్డుపై 405 పరుగులు చూసి తాము కంగారుపడిపోయాం అని, కానీ అంతా సవ్యంగా సాగిందని చెప్పాడు. రోహిత్ భాయ్ తనకు బాగా సహకరించాడని గిల్ ప్రశంసలు కురిపించాడు.
అంత సులభం కాదు:
‘గువాహటిలో మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉండటంతో నా శరీరంలోని ప్రతి భాగంలోనూ క్రాంప్స్ (కండరాలు పట్టేయడం) వచ్చాయి. వెస్టిండీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్న సమయంలో 13 ఓవర్లు పూర్తయ్యేసరికి.. మేము అప్పటికే 20-25 ఓవర్లు ఫీల్డింగ్ చేసినంత అలసటగా అనిపించింది. గువాహటిలో అంత వేడి, ఉక్కపోత ఉంది. అయినా మా ఫీల్డర్లు మైదానంలో బాగా కదిలారు. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. వికెట్ ఎంత బాగున్నా, మైదానం ఎంత చిన్నదైనా ఇలాంటి భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. విజయం సాధిస్తామా అనే సందేహం నాలో కలిగింది. అయితే మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చడం చాలా సంతోషంగా ఉంది’ అని శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.
Also Read
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
రహస్యం ఏమీ లేదు:
‘నా ప్రస్తుత ఫామ్ వెనుక ప్రత్యేకమైన రహస్యం ఏమీ లేదు. మ్యాచ్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఆడటమే న టార్గెట్. పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 75-80 పరుగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కొత్త బంతితో కొంత స్వింగ్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. బంతి పాతబడిన తర్వాత బ్యాటింగ్‌కు వికెట్ మరింత అనుకూలంగా మారుతుందని ముందుగానే అంచనా వేశాం. మైదానంలో ఒక వైపు బౌండరీ చిన్నగా ఉండటంతో ఫాస్ట్ బౌలర్లు వచ్చినప్పుడు ఆ వైపును లక్ష్యంగా చేసుకోవాలని భావించాం. 25 ఓవర్లకు 200-210 పరుగులు ఉంటే మంచి స్థితిలో ఉంటామని ముందే అనుకున్నాము. అయితే మేము 230-240 పరుగులు చేశాం. మధ్యలో వికెట్లు కోల్పోకపోవడం అదనపు ప్రయోజనంగా మారింది’ అని గిల్ పేర్కొన్నాడు.
మా బౌలర్లు రాణించలేదు:
‘పవర్‌ప్లేలో మా బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి వన్డేలోనూ ఇదే సమస్య. వెస్టిండీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో ఒక దశలో వారు 420-430 పరుగులు చేసేలా కనిపించారు. అయితే డెత్ ఓవర్లలో మా బౌలర్లు బాగా బంతులు వేశారు. 25-30 పరుగులు తక్కువగా ఇవ్వడం కూడా ప్రయోజనంగా మారింది. మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాము. మూడో వన్డేలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలను పరిశీలిస్తాం. ఇప్పటివరకు అవకాశం దక్కని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని తాను అనుకుంటున్నా. అప్పుడు భిన్నమైన కాంబినేషన్లను పరీక్షించడంతో పాటు ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది’ అని గిల్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
ట్రెండింగ్
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!