Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- ఫైదుబాయ్ విమాన ఘటనలో హీరోగా నిలిచిన పైలట్ స్మిత్ మచ్చర్..
- భారతీయ పైలట్‌పై ఇజ్రాయిల్ మీడియా ప్రశంసలు..
- కోపైలట్ కత్తితో పొడిచినా ప్రయాణికుల భద్రత కోసం పోరాటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flydubai: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో జరిగిన ఘటన ప్రపంచాన్ని కలవరపెట్టింది. కో-పైలట్, పైలట్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇజ్రాయిల్ అధికారులు ప్రకారం.. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ మొత్తం ఘటనలో పైలట్ గాయంతో రక్తమోడుతున్నా కాక్‌పిట్ వదలకుండా 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఎక్కువ మంది ఇజ్రాయిల్ జాతీయులు ఉన్న ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన వ్యక్తి భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్గా తేలింది. ఇజ్రాయిల్ మీడియా గుజరాత్‌కు చెందిన స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని కొనియాడుతోంది.
కాక్‌పిట్‌లో ఘర్షణ సమయంలో కో-పైలట్ కత్తితో దాడి చేసిన, విమానంపై పూర్తి నియంత్రణ కోల్పోలేదు. ఒకానొక సమయంలో నిమిషాల్లోనే విమానం 34,000 అడుగుల ఎత్తు నుంచి 14,000 అడుగులకు దిగింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ ఘటనపై స్పందిస్తూ.. కో పైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసి, విమానంలో వ్యవస్థల్ని తారుమారు చేసి కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
ఈ మొత్తం ఘటనలో దాడి చేసిన కోపైలట్‌ను కొందరు ప్రయాణికులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఇతర పైలట్లు విమానాన్ని నియంత్రించేందుకు సహాయం చేసినట్లు సమాచారం. చివరకు సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో విమానం సేఫ్‌గా ల్యాండైంది. ప్రయాణికుల్ని కాపాడి స్మిత్ మచ్చర్ భారతీయుడని పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆయనకు బోయింగ్ 737 విమానాలు నడిపిన అనుభవం ఉందని నివేదికలు చెబుతున్నాయి. గాయపడిన తర్వాత స్మిత్ తబూక్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!