IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Sri Lanka semi-final playing XI: 2026 ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీల్లో భాగంగా భారత్, శ్రీలంక జట్లు సెమీఫైనల్లో తలపడనున్నాయి. గురువారం (అక్టోబర్ 1న) జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. గత ఆసియా క్రీడల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు స్వర్ణ పతక పోరుకు చేరుకోవాలని శ్రీలంక కూడా పట్టుదలగా ఉంది. వర్షం కారణంగా ఇరు జట్ల క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు రద్దు కావడంతో.. మెరుగైన సీడింగ్ ఆధారంగా భారత్, శ్రీలంక నేరుగా సెమీఫైనల్‌కు చేరాయి. ఒకవేళ సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే.. మెరుగైన సీడింగ్ ఉన్న భారత్ ఫైనల్‌కు చేరుతుంది.
పూర్తి స్థాయి టీ20 జట్టుతో భారత్:
Also Read
- Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
- Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
- Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
- Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు పూర్తి స్థాయి టీ20 జట్టుతో బరిలోకి దిగుతోంది. ఇషాన్ కిషన్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే వంటి బ్యాటర్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నారు. ఈ ఏడాది టీ20ల్లో ఇషాన్ 27 ఇన్నింగ్స్‌ల్లో 905 పరుగులు చేశాడు. సంజు 18 మ్యాచ్‌ల్లో 526 పరుగులు సాధించగా.. దూబే 502 పరుగులతో పాటు 15 వికెట్లు తీశాడు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ గత 22 టీ20ల్లో 30 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా గత 15 టీ20ల్లో 22 వికెట్లు సాధించాడు. జపాన్‌తో వర్ష ప్రభావిత మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. శ్రీలంకతో సెమీఫైనల్లో తిరిగి జట్టులోకి వస్తున్నాడు. సంజు జట్టులో ఉండడంతో యువ అంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశ తప్పదు.
నీరోషన్ డిక్వెల్లా ఒక్కడే:
శ్రీలంక మాత్రం రెండో శ్రేణి జట్టుతో ఆసియా క్రీడల్లో పాల్గొంటోంది. సహన్ అరచిగే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 2026 లంక ప్రీమియర్ లీగ్‌లో అతడు 10 ఇన్నింగ్స్‌ల్లో 240 పరుగులు చేశాడు. నీరోషన్ డిక్వెల్లా 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవంతో జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన బ్యాటర్లలో ఒకడిగా ఉన్నాడు. బౌలింగ్‌లో నువాన్ తుషారా కీలకంగా మారే అవకాశం ఉంది. అతడు 31 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 36 వికెట్లు పడగొట్టాడు. చమిక కరుణరత్నే, బినుర ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ కూడా శ్రీలంక బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.
భారత్ ఆధిపత్యం:
ఇటీవలి టీ20 రికార్డుల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. టీమిండియా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. శ్రీలంకపై కూడా భారత్ చివరి ఐదు టీ20ల్లో గెలిచింది. ఇరు జట్ల మధ్య ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ వరకు వెళ్లడం ఈ పోరుకు ఉన్న ఉత్కంఠను తెలియజేస్తోంది.
స్పిన్నర్లకు అనుకూలం:
కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లోని పిచ్ ఇప్పటివరకు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. ఇక్కడ బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడటం కష్టం. ఇటీవలి వర్షాల ప్రభావంతో పిచ్ మరింత నెమ్మదిగా మారే అవకాశం ఉంది. కొత్త బంతితో పేసర్లకు కొంత స్వింగ్ లభించవచ్చు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ వేదికపై ఇప్పటివరకు 10 టీ20 మ్యాచ్‌లు జరగగా.. కేవలం నాలుగు మ్యాచ్‌లే పూర్తయ్యాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 108 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్ సగటు 87 పరుగులుగా ఉంది. నేపాల్-జపాన్ మ్యాచ్‌లో 149/4 అత్యధిక జట్టు స్కోరుగా నమోదైంది.
వర్షం ముప్పు తప్పదా?:
అక్టోబర్ 1న నిషిన్‌లో వాతావరణం వెచ్చగా, పాక్షికంగా మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఇదే వేదికపై క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన నేపథ్యంలో.. సెమీఫైనల్‌కు కూడా వాతావరణం కీలక అంశంగా మారింది.
ప్రత్యక్ష ప్రసారం:
భారత్-శ్రీలంక ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ సెమీఫైనల్ అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. SonyLIV యాప్, వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
-
Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!