CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- TVKలో మోనార్కీకి చోటు లేదు
- ధారాపురం సభలో విజయ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay at Dharapuram Rally: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ ధారాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకే తప్ప, రాజరికం లేదా కుటుంబ పాలనను కొనసాగించేందుకు కాదని అన్నారు. ధారాపురం అసెంబ్లీ ఉపఎన్నికలో TVK అభ్యర్థి పి. సత్యభామకు మద్దతుగా సెప్టెంబర్ 30న విజయ్ ప్రచారం నిర్వహించారు. ధారాపురం ఉపఎన్నికకు అక్టోబర్ 6న పోలింగ్, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.
‘ప్రజలు మాపై నమ్మకం ఉంచారు’
2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీపై నమ్మకం ఉంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారని విజయ్ పేర్కొన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కొంతమంది తమ పార్టీ ప్రజలిచ్చిన తీర్పును మర్చిపోయిందని భావిస్తున్నారని అన్నారు. అయితే ప్రజల విశ్వాసాన్ని తాము ఎప్పటికీ మర్చిపోలేదని పేర్కొన్నారు.
Also Read
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
‘రాజరిక ఆలోచన మాకు లేదు’
తమ పార్టీకి మోనార్కీ లేదా రాజరిక పాలన అనే ఆలోచనే లేదని విజయ్ స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా పనిచేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేస్తున్నామని విజయ్ తెలిపారు.
అవినీతి రహిత పాలనపై దృష్టి
తమ ప్రభుత్వం అవినీతి, లంచాలకు తావులేని పాలన అందించేందుకు కట్టుబడి ఉందని విజయ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాఠశాలలు, ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్న 717 TASMAC మద్యం దుకాణాలను మూసివేసినట్లు వెల్లడించారు.
మహిళల భద్రతకు ‘సింగపెన్’ టాస్క్‌ఫోర్స్
మహిళల భద్రత కోసం ‘సింగపెన్’ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద 2,546 కొత్త పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే తమిళనాడులోని 37 జిల్లాలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లలో డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 65 బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని విజయ్ తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసే పాల ధరను లీటరుకు రూ.6 పెంచినట్లు కూడా చెప్పారు.
ధారాపురం ఉపఎన్నికపై ఉత్కంఠ
ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 6న ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో TVK అభ్యర్థి పి. సత్యభామకు మద్దతుగా విజయ్ ప్రచారం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 9న జరగనుంది. ఉపఎన్నికల ప్రచారంలో విజయ్ తన ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూనే, TVK రాజకీయ లక్ష్యాలు, ప్రజలపై తమ బాధ్యత గురించి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత ధారాపురం ఉపఎన్నికల ప్రచారంలో రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి.
తాజావార్తలు
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!