PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదు.. పాక్‌పై మోడీ ఫైర్
- ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదు
- పాకిస్థాన్‌పై ప్రధాని మోడీ ఫైర్
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదని.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. చైనాలోని టియాంజిన్ వేదికగా జరుగుతున్న ఎస్సీవో శిగ్రరాగ్ర సమావేశంలో మోడీ ప్రసంగించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని మోడీ ప్రస్తావించారు. ఉగ్ర సంస్థలకు కొన్ని దేశాలు అందించే బహిరంగ మద్దతును సహిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఉగ్రవాదం ఏ దేశ భద్రతకు క్షేమం కాదని.. మొత్తం మానవాళికే ముప్పు అని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
Also Read
- Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్‌తో భారత్‌ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
భారతదేశం నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటోందని.. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో తమకు అండగా నిలిచిన దేశాలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. అందరూ స్పష్టంగా తమ అభిప్రాయాన్ని చెప్పాలన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి మానవత్వాన్ని విశ్వసించే ప్రతి దేశానికి బహిరంగ సవాల్ అన్నారు. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఆమోదయోగ్యమేనా? అని నిలదీశారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా.. ఏ రంగులోనైనా మనం ఏకగ్రీవంగా వ్యతిరేకించాలన్నారు. ఇది మానవత్వం పట్ల మనకున్న విధి అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ-పుతిన్-జిన్‌పింగ్ సంభాషణ.. ఎక్స్‌లో ఫొటోలు పెట్టిన మోడీ
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదలుు 26 మందిని చంపేశారు. అనంతరం భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన ఆంక్షలు విధించింది. సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసేసింది. ఇక మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతం చేయగా.. వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
టియాంజిన్‌లో జరిగే ఎస్సీవో శిఖరాగ్ర సమావేశానికి 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్‌కు ఎస్సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది.
- Tags
- china
- Pakistan
- PM Modi fires
- SCO
తాజావార్తలు
-
Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
-
RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
-
RCB vs GT: చిన్నస్వామిలో కోహ్లీ విశ్వరూపం.. గుజరాత్‌ను ఉతికేసిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో టాప్-2కి జంప్!
-
Sree Vishnu : హిట్లు లేకున్నా జోరు తగ్గని శ్రీవిష్ణు..
-
Astrology: ఏప్రిల్ 25, శనివారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!