జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్‌ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదని.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. చైనాలోని టియాంజిన్ వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో శిగ్రరాగ్ర సమావేశంలో మోడీ ప్రసంగించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని మోడీ ప్రస్తావించారు.
బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దాయాది దేశం తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం ఉగ్రవాద బాధిత దేశమని.. పాకిస్థాన్ మాత్రం మద్దతుదారుడు అని తెలిపారు.