PM Modi: బ్రిక్స్ వేదికగా పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన మోడీ
- బ్రిక్స్ వేదికగా పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన మోడీ
- బాధితులను మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దాయాది దేశం తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం ఉగ్రవాద బాధిత దేశమని.. పాకిస్థాన్ మాత్రం మద్దతుదారు అని తెలిపారు. బాధితులను మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమని చెప్పారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన దేశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భారదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ధన్యవాదాలు చెప్పారు. ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాద వ్యాప్తికి వ్యతిరేకంగా మాట్లాడని.. ఏమీ చేయని వారిని కూడా పరోక్షంగా మోడీ ప్రస్తావించారు. ఇక పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తుందో భారత్ స్పష్టమైన ఆధారాలను చూపించింది.
పహల్గామ్ ఉగ్రదాడి మొత్తం మానవాళిపై జరిగిన దాడిగా మోడీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై ప్రపంచ వ్యాప్తంగా ఐక్యంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ ఘటన అమానుషం, పిరికితనంతో కూడిన ఉగ్రదాడిగా పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుని బోధనల నుంచి ప్రేరణ పొంది.. భారతదేశం శాంతి మార్గాన్ని కొనసాగిస్తుందన్నారు. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మానవాళి సంక్షేమానికి శాంతి ఉత్తమ మార్గంగా మిగిలిపోయిందని చెప్పారు.
Also Read
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
ఇది కూడా చదవండి: YS Jagan: నేటి నుంచి కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. రేపు ఇడుపులపాయకు మాజీ సీఎం..
2026లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిక్స్ గ్రూప్ నాయకులంతా ఖండించారు. నేరపూరితమైనది, అన్యాయమైనదిగా రియో డి జనీరో డిక్లరేషన్ ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. ‘‘2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలిక, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, సురక్షిత స్వర్గధామాలు వంటి అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నాము.’’ అని పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Samantha : ‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన సమంత
తాజావార్తలు
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఫిక్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..