టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవల అమెరికాలో నిర్వహించిన తానా (TANA) వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి పొందిన ఆదరణతో సామ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానుల ప్రేమ గుర్తు చేసుకుంటూ తన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ నుండి ఇప్పటి వరకు తన పై చూపిన అపారమైన ఆదరణ పై.. అందరి మధ్య నిలబడి మాట్లాడిన సమంత, తన మనసులో దాగిన కృతజ్ఞతను, అభిమానులపై తనకున్న ప్రేమను అక్షరాలా చెక్కినట్లుగా చెబుతూ, చాలా ఎమోషనల్ అయ్యారు..
Also Read : Yash : యష్ ‘టాక్సిక్’ సినిమా పై క్రేజీ బజ్..
సమంత మాట్లాడుతూ.. ‘నా తొలి సినిమా ‘ఏ మాయ చేసావే’ నుండి మీరు నన్ను మీ మనిషిలా భావించారు. నాపై చూపించిన మమకారం, ప్రేమకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఇది మంచి సమయం.. మీరు నాకొక ఐడెంటిటీ ఇచ్చారు. మీరే నా కుటుంబం. ఇన్ని సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆరోగ్యంగా ఉన్నా, లేకపోయినా..కెరీర్ పరంగగా ఉన్నా లేకపోయినా.. ఒకే స్థిరమైన ప్రేమను పంచారు. అందుకే మీరున్నారనే ధైర్యంతోనే ప్రతి అడుగు వేస్తున్నాను. ప్రస్తుతం నా కెరీర్‌లో కీలక దశలో ఉన్నా. ఇటీవల నిర్మాతగా మారాను. ‘శుభం’ అనే సినిమాతో తొలి ప్రయత్నం చేశాను. తెలుగు ప్రేక్షకులందరూ ఆ సినిమాను ఆదరించారు. మంచి ఫలితం ఇచ్చారు. ఈ ప్రయాణంలో మీరే నా బలం.’ అంటూ తెలిపింది. ఇందులో ‘మీరున్నారనే నాధైర్యం ఉంది’ అంటూ చెప్పిన సమంత మాటలు, ఎన్నో మంది అభిమానుల హృదయాలను తాకాయి.