అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో వెళ్తున్న ప్రైవేటు జెట్ ఈశాన్య రాష్ట్రమైన మైనేలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. ప్రమాదం జరగగానే మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Petrol-Diesel Prices: వాహనదారులకు రిపబ్లిక్ డే శుభవార్త.. ఈ నగరాల్లో తగ్గిన పెట్రోల్ ధరలు
ఆదివారం సాయంత్రం 7:45 గంటలకు మైనేలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా బాంబార్డియర్ ఛాలెంజర్ 600 విమానం కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 8 మంది ఉన్నారు. ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ ప్రకటించారు. వెంటనే రన్‌వేను మూసేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ప్రయాణికుల జాడ గురించి ఇంకా తెలియలేదని అధికారలు వెల్లడించారు. విమానం హోస్టన్కు చెందిన ఒక కంపెనీపై రిజిస్టర్ అయినట్లుగా సమాచారం.
ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానాశ్రయంలో శిథిలాల నుంచి పొగలు పైకి లేస్తున్నాయి.

Current scene in Bangor. pic.twitter.com/MddLPAYxfh
— 3315 Aviation (@3315Aviation) January 26, 2026