ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ సమస్య, నీటి వనరుల సమస్యలు ఇలా ఎన్నో ఉన్నాయి. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. రెండుదేశాలు ద్వైపాక్షికంగా ఎన్నోసార్లు చర్చించుకున్నా పరిష్కారం కాలేదు. కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాక్‌తో సంబంధాలు మరింత దిగజారాయి. పాక్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలికితేనే ఆ దేశంలో చర్చలు జరుపుతామని ఇండియా ఇప్పటికే స్పష్టం చేసింది.
Read: Diamond: ఇసుకబట్టీ ఓనర్… రాత్రికి రాత్రే ఇలా… అదృష్టం అంటే ఇదే…
ఇక ఇదిలా ఉంటే, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత ప్రధానితో టీవీ డిబేట్‌లో పాల్గొనాలని ఉందని, ఈ డిబేట్ ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇటీవలే రష్యాటుడే న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంతర్వ్యూలో భారత్, పాక్ సంబంధాలపై అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. పీఎం మోడీ రెడీ అంటే తాను సిద్దంగా ఉన్నానని, టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొనడం ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు కొంతమేర మెరుగుపడే అవకాశం ఉంటుందని పాక్ పీఎం పేర్కొన్నారు. మరి దీనిపై ప్రధాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.