Big Breaking: ‘లైగర్’ తరువాత కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ విజయ్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక ఈ సినిమా పరాజయం నుంచి బయటపడడానికి రౌడీ హీరోకు చాలా సమయమే పట్టింది. మధ్యలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమానత హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇది ఇంకా సెట్స్ మీద ఉండగానే విజయ్ మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. జెర్సీ సినిమాతో నానికి బిగ్గెస్ట్ హిట్ ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్.. VD12 చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ లో విజయ్ పోలీస్ దుస్తుల్లో మాస్క్ వేసుకొని కనిపించాడు. ” నేను ఎవరిని మోసం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు” అని ఒక స్పై చెప్పిన వాక్యాన్ని రాసుకొచ్చారు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మొదటి సారి వీడీ స్పై గా, పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో మిగతా నటీనటుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..