Pakistan PM: ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భాగంగా వ్లాదిమిర్ పుతిన్‌ను పాకిస్తాన్ షెహబాజ్ షరీఫ్ కలిశారు. పుతిన్‌తో భేటీ సందర్భంగా షరీఫ్ అవస్థలు పడ్డారు. ఆయన అవస్థలు చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముసిముసిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశానికి ముందు పుతిన్ తన చెవిలో ఇయర్‌ఫోన్స్ వంటి పరికరాన్ని పెట్టుకున్నారు. పాక్ ప్రధాని మాత్రం తన చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఎవరైనా వచ్చి సాయం చేయండంటూ వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు. ఓ సహాయకుడు వచ్చి ఇయర్‌ఫోన్‌ను పెట్టి వెళ్లిపోయారు. మళ్లీ కాసేపటికి అది చెవిలో నుంచి ఊడి కిందపడింది. మళ్లీ సహాయకుడు రావాల్సి వచ్చింది. ఈ తతంగమంతా చూస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బయటకు వినబడేలా పగలబడి నవ్వారు.
Nitish Kumar: నితీష్ కుమార్ సంచలన ప్రకటన.. బీజేపీయేతర కూటమి గెలిస్తే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా!
ఈ వీడియోను పీటీఐ పార్టీ నేత ఒకరు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ క్రెం మినిస్టర్ పాకిస్థాన్‌కు తలవంపులు తెస్తున్నారని కామెంట్ చేశాడు. ఈ సంఘటన దేశానికి “అవమానకరం” అని పేర్కొంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.
This CrimeMinister is a constant embarrassment for Pakistan. Even President Putin had to eventually just laugh at this clumsy man. Pathetic. This is what conspirators wanted? To have by design a politician who would not only be a crook but also a pathetic apology for a PM? pic.twitter.com/mmEhLY7RZg
— Shireen Mazari (@ShireenMazari1) September 15, 2022