Pakistan: సౌదీకి వెళ్తున్న పాక్ బిచ్చగాళ్ల అరెస్ట్.. విమానం నుంచి దించి విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయుల్లో 90 శాతం బిచ్చగాళ్లే అని ఇటీవల తేలింది. సౌదీ, ఇరాక్, యూఏఈతో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరప్ దేశాలకు వెళ్తున్న పాకిస్తానీయులు భిక్షాటన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల రాయబారులు ఈ విషయంలో పాకిస్తాన్‌కి ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు పాకిస్తాన్ ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి.
తాజాగా పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియా వెళ్లేందుకు ప్రయత్నించిన 16 మంది బిచ్చగాళ్లను పట్టుకున్నారు. వీరింతా పాక్ నగరం ముల్తాన్ నుంచి సౌదీ వెళ్తున్న విమానంలో వీరిని గుర్తించి, విమానం నుంచి దించేశారు. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ(FIA) రెండు రోజుల క్రితం ముల్తాన్ విమానాశ్రయంలో వీరిని అదుపులోకి తీసుకుంది.
Also Read
- SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- US - Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్‌కు కష్టమేనా!
- Hantavirus: హంటావైరస్‌పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
Read Also: ISIS: చదివింది ఇంజనీరింగ్.. చేస్తున్నది టెర్రరిజం.. ఐసిస్ కుట్రలో సంచలన విషయాలు..
పట్టుబడిన వారిలో 11 మంది మహిళలు ఉండగా.. నలుగురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. వీరంతా పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్తున్నట్లుగా వీసాలు తీసుకుని, అక్కడికి వెళ్లి భిక్షాటన చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో వారంతా భిక్షాటన చేయడానికి సౌదీ వెళ్తున్నామని ఒప్పుకున్నారు. భిక్షాటన ద్వారా వచ్చే డబ్బుల్లో సగం సంపాదనను ప్రయాణ ఏర్పాట్లు చేసిన ఏజెంట్లకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఉమ్రా వీసా గడువు ముగిసిన తర్వాత వారంతా సౌదీ నుంచి పాకిస్తాన్ తిరిగి వస్తారు.
ఇటీవల పాకిస్తాన్ మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక విషయాలను వెల్లడించింది. విదేశాలకు వెళ్తున్న పాకిస్తానీయులు భిక్షాటన చేస్తున్నారని, 90 శాతం మంది అడుక్కుంటున్నారని వెల్లడించింది. ఇరాక్, సౌదీ అరేబియా జైళ్లు భిక్షాటన చేస్తున్న పాకిస్తానీయులతో నిండిపోతున్నాయని వెల్లడించింది.
తాజావార్తలు
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
CM Vijay: IMDb లిస్ట్‌ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి ‘దళపతి’! అసలేం జరిగిందంటే..
-
Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
-
Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!