Pakistan: విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయుల్లో 90 శాతం బిచ్చగాళ్లే అని ఇటీవల తేలింది. సౌదీ, ఇరాక్, యూఏఈతో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరప్ దేశాలకు వెళ్తున్న పాకిస్తానీయులు భిక్షాటన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల రాయబారులు ఈ విషయంలో పాకిస్తాన్‌కి ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు పాకిస్తాన్ ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి.