US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
- అమెరికా మరోసారి దాడి చేస్తే యుద్ధ స్వరూపమే మార్చేస్తాం..
- ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్..
- చర్చలకైనా, యుద్ధానికైనా సిద్ధమే అంటూ సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Tensions: అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతిచర్చల్లో కీలక ప్రతినిధి మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ హెచ్చరించారు. అమెరికా చర్చల మార్గాన్ని ఎంచుకున్నా, యుద్ధాన్ని ఎంచుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. ఇరాన్ ప్రతిపాదించిన ఏడు షరతులను అంగీకరిస్తేనే ఒప్పందానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా మరో తప్పు చేస్తే యుద్ధ స్వరూపమే మారిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ ఇరాన్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
అమెరికా, ఇజ్రాయిల్‌లు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. తొలిరోజు దాడిలోనే ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దీని తర్వాత ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రైయిన్ దేశాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసింది.
Also Read
- Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
- Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
- Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
- Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
ఇదిలా ఉంటే, ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసే విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారినట్లు తెలుస్తోంది. ఇరాన్ లేదా యెమెన్‌లోని హౌతీలు కవ్వింపు చర్యలకు పాల్పడకపోతే ఇరాన్‌పై మరోసారి దాడి చేయకుండా ఉండేందుకు అవకాశం ఉందని ట్రంప్ తన సీనియర్ సలహాదారుల వద్ద ప్రస్తావించినట్లు నివేదికలు వెల్లడించాయి. గత రెండు వారాలుగా ట్రంప్ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయవద్దని వారిద్దరూ సూచించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
Warangal Fake Doctors : పెద్ద ఆసుపత్రుల్లో బిల్లుల బాదుడు.. చిన్న క్లినిక్‌లలో నకిలీ వైద్యులు.!
-
AP Eelctions: మొదటి రోజే రణరంగంగా పల్నాడు.. విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం..
-
OTR : తెలంగాణలో గిగ్ వర్కర్స్ పాలసీ.. కాంగ్రెస్ లక్ష్యం ఏంటి..?
-
Government Jobs: 7,390 ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!