పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.. ఆ దేశ దేశీయ వాణిజ్యం క్షీణించిపోయింది.. మరోవైపు.. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు కూడా దొరక్కపోవడంతో పాక్ ఖాజానా ఖాళీ అయ్యింది.. దీంతో.. దిద్దుబాటు చర్యలకు దిగిన పాక్.. కొత్త జాతీయ భద్రతా పాలసీని తీసుకొచ్చింది.. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వంటి సంస్థలను రుణాల కోసం ఆశ్రయించిన ఆ దేశం.. సరైన స్పందనలేదని ఆరోపిస్తోంది.. దీంతో.. కొన్ని వర్గాలుగా కాదు.. ఓ జాతిగా మనందరం అభివృద్ధి సాధించడానికి జాతీయ భద్రతా విధానం తీసుకొచ్చినట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ఇస్లామాబాద్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన దేశ జాతీయ భద్రతా విధానం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, గతంలో పాకిస్థాన్ ఎక్కువగా సైనిక సామర్థ్యాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది.. భారీగా బడ్జెట్‌ను కూడా ఖర్చు చేస్తూ వచ్చింది.. కానీ, చరిత్రలో తొలిసారి దేశ పౌరుల ప్రగతి ధ్యేయంగా జాతీయ భద్రతా విధానాన్ని తీసుకొచ్చింది.. జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ)తోపాటు పాక్ కేబినెట్ గత నెల ఈ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఎన్‌ఎస్‌సీ ఈ కొత్త విధానం ప్రగతిని తరచూ సమీక్షిస్తుందని ఇమ్రాన్ ప్రకటించారు. ఐదేళ్ల పాటు అమలులో ఉండే ఈ విధానాన్ని వంద పేజీల డాక్యుమెంటుగా రూపొందించేందుకు ఏడేళ్లు పట్టినట్టు చెబుతున్నారు..