Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్‌లో ఇజ్రాయిల్ భయాలు..
- పాకిస్తాన్‌లో ఇజ్రాయిల్ భయాలు..
- పాక్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ వ్యతిరేక కథనాలు..
- శాంతి చర్చలకు భంగం కలిగిస్తుందనే ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Israel: అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా పాకిస్తాన్ మారింది. చర్చలకు ముందు పాకిస్తాన్ ఇజ్రాయిల్‌ల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మీడియా ఇజ్రాయిల్ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తోంది. చర్చల్ని అడ్డుకోవడానికి ఇజ్రాయిల్ అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోందని పాకిస్తానీ వార్తా పత్రిక ‘డాన్’ తన ఎడిటోరియల్‌లో రాసుకొచ్చింది. దీనికి ముందు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయిల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pakistan: మిడిల్ ఈస్ట్‌కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
- Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
‘‘ఇజ్రాయిల్‌ను నాశనం చేయడానికి అమెరికాతో కలిసి చేసిన ఇజ్రాయిల్ ప్రయత్నం విఫలమైంది’’ అని, తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైనందున ప్రభత్వాన్ని ఇజ్రాయిల్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోందని డాన్ రాసింది. ఇరాన్ మిత్రపక్షమైన హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకునే నెపంతో ఇజ్రాయిల్ లెబనాన్ ప్రజలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోందని డాన్ ఆరోపించింది. ఇరాన్‌ను సులభంగా ఓడించాలనే దానిపై ట్రంప్‌కు ఇజ్రాయిల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పింది. ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న శాంతి ప్రయత్నాలు విఫలం చేయడానికి ఇజ్రాయిల్ అన్ని రకాల ఎత్తుగడల్ని వేస్తోందని పాకిస్తానీ పత్రిక ఆరోపించింది. లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆరోపించింది.
మరో పాకిస్తానీ మీడియా జియో న్యూస్ కూడా ఇలాంటి కథనాలనే ప్రచురించింది. ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటనను ప్రముఖంగా ప్రస్తావించింది. ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదని, అయితే యుద్ధానికి కారణమైన దోషుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించింది. మరోవైపు, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ట్వీట్‌లో ఇజ్రాయిల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ మానవాళికి ముప్పుగా మారిందని, క్యాన్సర్ లాంటిదని అన్నారు. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతుండగా గాజా, ఇరాన్, లెబనాన్‌పై దాడులు చేస్తుందని దుయ్యబట్టారు. ఈ పోస్టుపై ఇజ్రాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఆసిఫ్ తన ట్వీట్‌ను తొలగించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!