Pakistan Envoy: బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపింది. అయితే, అహ్మద్ మరూఫ్ మే 11న ఢాకా విడిచి వెళ్లినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. దుబాయ్ మీదుగా అతడు ఇస్లామాబాద్ వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా, మరూఫ్ సెలవు గురించి పాకిస్తాన్ హైకమిషన్, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది.
Read Also: Tech Layoffs: ఆందోళనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. మైక్రోసాఫ్ట్ భారీగా లేఆఫ్స్
అయితే, సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఎందుకు వెళ్లారు?ఎన్ని రోజులు సెలవులో ఉంటారనేది మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరోవైపు, పాక్ విదేశాంగశాఖ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేదు. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, మరూఫ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో అతడు క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత అనుబంధం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ సదరు యువతితో షేర్ చేసుకుని ఉంటారనే అనుమానాలు ఉన్నాయి.
Read Also: Chandrayangutta Murder: చాంద్రాయణగుట్టలో వీడిన మహిళ హత్య కేసు.. పెళ్లి చేసుకోమనడంతో..!?
భారత్‌తో ఉద్రికత్తల వేళా పాకిస్తాన్ ఇతర దేశాల సాయం కోసం వేచి చూస్తుంది. ఈ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం.. ఆ దేశాన్ని మరింత ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇప్పటికే గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించింది. 24 గంటల్లోగా ఇండియా వీడి వెళ్లిపోవాలని గడువు విధించింది మోడీ సర్కార్.