Truck Blast In Jaipur: రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లోని భంక్రోటా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌లో ఈ రోజు (డిసెంబర్ 20) ఉదయం భారీ అగ్ని ప్రమాద చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆపి ఉంచిన సీఎన్‌జీ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం నెలకొంది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాప్తి చెండదంతో పలు వాహనాలు మంటల్లో కాలిబుడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో 37మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి 22 ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి.
Read Also: Mohan Babu: మళ్లీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు!
భారీగా చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాదంతో ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్‌సింగ్ హస్పటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా వెళ్లనున్నారు.
VIDEO | Rajasthan: A gas tanker caught fire on Ajmer Road in #Jaipur earlier today. Several vehicles were also gutted in fire. More details are awaited.#JaipurNews
(Full video available on PTI videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/kIJcm3AQRJ
— Press Trust of India (@PTI_News) December 20, 2024