Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyani Priyadarshan: బాలీవుడ్లో భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు, పీరియడ్ డ్రామాల తర్వాత ఇప్పుడు జాంబీ థ్రిల్లర్ జానర్‌పై కూడా ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో స్టార్ హీరో రణవీర్ సింగ్ కొత్త తరహా కథలను ఎంచుకుంటూ తన కెరీర్లో భిన్నమైన ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న రాబోయే జాంబీ థ్రిల్లర్ ‘ప్రళయ్’ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ‘దురంధర్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరో ఈ కొత్త ప్రయోగంలో ఎలా కనిపించబోతున్నారనేది ఆసక్తిగా మారంది. సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే తారాగణం గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో కూడా మూవీపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ముఖ్యంగా కథానాయిక పాత్ర కోసం దక్షిణాది నటి కళ్యాణి ప్రియదర్శన్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది.
ఈ మూవీకి దర్శకుడు జై మెహతా దర్శకత్వం వహించనుండగా, త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. జాంబీ నేపథ్యంలో సాగే ఈ కథలో ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో పాటు బలమైన కంటెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నాయి. అందుకే ప్రతి పాత్రకు సరిపోయే నటీనటులను ఎంపిక చేయడంపై చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘లోక’ చిత్రంలో సూపర్ హీరో పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమాలో ఆమె చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అదే కారణంగా ‘ప్రళయ్’లోనూ బలమైన మహిళా పాత్ర కోసం ఆమె పేరును పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
ఈ ప్రాజెక్ట్ ఖరారైతే కళ్యాణి ప్రియదర్శన్‌కు ఇది బాలీవుడ్లో ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణాది చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ఇప్పుడు హిందీ చిత్రసీమలో కూడా అడుగుపెడితే కెరీర్‌కు కొత్త దిశ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోతో తొలిసారి జతకట్టే అవకాశం రావడం కూడా ఆమె కెరీర్ కు కీలక మలుపుగా మారనుంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి కళ్యాణి ప్రియదర్శన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రణవీర్ సింగ్ అభిమానులతో పాటు దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ నిజమవుతుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!