Pak Man Accused Of Blasphemy Dragged Out Of Jail Killed By Mob: పాకిస్తాన్‌లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడ్ని.. కొందరు దుండగులు జైల్లో దూరి మరీ అతడ్ని చంపేశారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. స్టేషన్‌లో విధుల్లో ఉన్న పోలీసుల ముందే ఈ హత్య జరిగింది. వాళ్లు కనీసం అడ్డుకోకపోవడం గమనార్హం. చివర్లో ఆ మృతదేహానికి నిప్పు పెడుతున్న సమయంలో.. పోలీసులు అడ్డుకున్నారు. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
220 Couples Married: ఒకే వేదికపై 220 జంటల పెళ్లి.. ప్రతి జంటకు మంచం, పరపు, దుప్పట్లు, బీరువా..
మహ్మద్ వారిస్ అనే 20 ఏళ్ల యువకుడు దైవదూషణ (ఖురాన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు) ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. ఇతడ్ని నాంకన సాహిబ్ ప్రాంతంలో ఉండే జైల్లో ఉంచారు. పాకిస్తాన్ చట్టం ప్రకారం.. దైవదూషణ నేరం. దీనికి మరణశిక్ష కూడా విధిస్తారు. వారిస్ కూడా ఆ నేరం చేయడంతో, జైల్లో వేశారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగానే.. ఓ దుండగుల గుంపు అతడ్ని చంపేసింది. తొలుత ఓ గుంపు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది. ఆ సమయంలో స్టేషన్‌లో కొంతమంది అధికారులు మాత్రమే ఉన్నారు. ఆ గుంపుని అడ్డుకునేలోపే.. వాళ్లు వారిస్‌పై దాడి చేసి చంపేశారు. అనంతరం అతని మృతదేహానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. అప్పుడు అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే ఆ గుంపుని అడ్డుకున్నారు.
Yevgeny Prigozhin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడే ఆగదు.. మరికొన్నేళ్లు సాగుతుంది
ఈ ఘటనపై వకాస్ పోలీస్ అధికారి మహ్మద్ వకాస్ మాట్లాడుతూ.. ‘‘ఉన్నట్లుండి ఓ గుంపు పోలీస్ స్టేషన్‌లోకి దూరింది. ప్రాంగణం నుండి వారిస్‌ని బయటకు తీసుకొచ్చి, అతనిపై దాడి చేసి చంపింది. ఆపై నిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నించింది. స్టేషన్‌లో కొంతమంది అధికారులు ఉన్నందున వారిని అడ్డుకోలేకపోయారు. అయితే.. మృతదేహాన్ని తగలబెట్టకుండా గుంపును ఆపగలిగాయి’’ అని పేర్కొన్నారు. ఆ గుంపుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ఘటనపై ఓ వీడియోని చిత్రీకరించారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. ఆ గుంపుని అడ్డుకోవడంలో విఫలమైన పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.
Turkey Earthquake: 160 గంటలు శిథిలాల కిందే.. ఆ వ్యక్తి మృత్యువును జయించాడు..