220 Couples Married: ఆకాశమంత పందిరి. భూదేవంత అరుగు. వేదమంత్రోచ్చరణల మధ్య ఒక్కటైనన దంపతులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 220 జంటలు ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నారు. సినిమా సెట్టింగులను తలపించేలా పాఠశాల ఆవరణను అందంగా అలంకరించారు. 900 అడుగుల భారీ కల్యాణ వేదికపై సుమారు వెయ్యి మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో జంట కల్యాణం కోసం 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో 220 పందిరి వేశారు. ఉదయం 10.05 గంటలకు 220 మంది పురోహితులతో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిగాయి.
Read also: Governor Tamilisai: తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన కామెంట్స్.. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం
నాగర్ కర్నూల్ జిల్లాలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించారు. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో 5 సార్లు సామూహిక వివాహాలు నిర్వహించి 720 మందికి ఉచిత వివాహాలు జరిపించారు. బంగారు పుస్తకాలతో పాటు పట్టు వస్త్రాలు, మంచం, బీరువా, వంట సామాగ్రి, నిజజీవితంలో అవసరమయ్యే వస్తువులను ఒక్కో జంటకు 2 లక్షల రూపాయల చొప్పున అందించారు.220 జంటలను ఒక్కొక్కరికి ముత్యాల పందిరి, ఒక వేద పండితుడు మరియు వధువు కుటుంబ సభ్యులు అందంగా అలంకరించారు. వివాహాది శుభకార్యాలను తిలకించేందుకు వచ్చిన సుమారు 30 వేల మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Read also: Governor Tamilisai: తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన కామెంట్స్.. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం
వివాహాల అనంతరం వారికి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రతి దంపతులకు స్టీలు పాత్రలు, మంచం, పరుపులు, దుప్పట్లు, బీరువా, రెండు కుర్చీలు, కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాలను ఉచితంగా అందజేశారు. కొత్త జంటలను ఆశీర్వదించారు. ఈ అరుదైన పెళ్లి వేడుకను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆప్రాంతమంతా వధూవరులతో ఆకర్షనీయంగా మారడంతో చూడముచ్చటగా ఉందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు అండగా వుండి ఇంతటి అద్భుతమైన పెళ్లి వేడుకను ఏర్పాటు చేసిన ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అభినందించి ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశరావు, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు, గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
11 Crore Current Bill: ఇదెక్కడి పంచాయితీ సామీ..! పంచాయతీ కార్యాలయానికి 11 కోట్ల కరెంట్ బిల్లా?