Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్
- శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండు దేశాలకు మధ్యవర్తిగా ప్రస్తుతం పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగినా ఫలించలేదు. మరోసారి చర్చలకు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్‌కు బయల్దేరి వెళ్లారు.
పశ్చిమాసియాలో 3 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరాన్-అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ఇప్పటికే పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ మూడు రోజుల పాటు టెహ్రాన్‌లో రహస్య దౌత్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో పాటు పలువురు కీలక నేతలను కలిశారు. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తగ్గించడం, ప్రాంతీయ శాంతి స్థాపన, దీర్ఘకాలిక స్థిరత్వంపై చర్చలు జరిగినట్లు ఇరాన్, పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ పరిణామాల మధ్య అసీమ్ మునీర్ పర్యటన వేగంగా ఖరారవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఇరాన్ దౌత్య వ్యవస్థలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయిని అధికారిక చర్చల బృంద ప్రతినిధిగా నియమించినట్లు అల్ అరేబియా వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ను మరోసారి చర్చల ప్రతినిధి బృందానికి నేతగా కొనసాగించారు.
ఇరాన్ ప్రభుత్వం చర్చల సమయంలో దౌత్య పరంగా మరింత సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక హెచ్చరికలు చేశారు. “ఇప్పుడే దౌత్యానికి చివరి అవకాశం. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు” అంటూ వ్యాఖ్యానించారు. చర్చలు విఫలమైతే అపూర్వ స్థాయి సైనిక చర్యలు ఉండవచ్చని వైట్ హౌస్ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఇక ఇరాన్‌లోని కఠినవాద వర్గాలు కూడా అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాత్కాలిక విరమణను ఉపయోగించుకుని అమెరికా మళ్లీ బలపడే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ.. అవసరమైతే మరింత కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో అసీమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో పాకిస్థాన్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..