కరోనా నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్‌కు దూరదృష్టి లేదన్నారు. కరోనా థర్డ్ వేవ్ అందోళనకరంగా ఉంది.విద్యా సంస్థలను కనీసం ఈ నెలాఖరు వరకూ మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ బారి నుంచి కాపాడుకోగలం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం- కేసులు పెరిగితే చూద్దాం అని చెప్పడం బాధ్యతారాహిత్యం. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా దేశంలోని రాష్ట్రాల్లో పాకుతోంది. ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా జిల్లాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నాడు. అయితే ఆ వ్యక్తికి దక్షిణాఫ్రికాలో నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్…
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. కరోనా ముందు ఎంతో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న అమెరికా సైతం మోకరిల్లిక తప్పలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ఏ రేంజ్‌లో ఉందని. అయితే భారత్ కూడా కరోనా రక్కసి చేతుల్లో చిక్కుకొని ఎంతో విలవిలలాడింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే కరోనా డెల్టా వేరియంట్ సృష్టించిన సెకండ్ వేవ్‌తో ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. డెల్టా వేరియంట్ నుంచి ఇప్పడిప్పుడే…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. రెండువారాల క్రితం నిత్యం వందల సంఖ్యలో వెలుగుచూసిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 10వేలు దాటింది. డిసెంబర్ తొలివారంలో రోజువారీ కేసుల సంఖ్య 16వేలకు చేరింది. దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం గణాంకాల ప్రకారం ఆ దేశంలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 86 వేలు దాటింది. వారం రోజుల్లోనే కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. రెండు వారాల కిందట కోవిడ్ పాజిటివిటీ…
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళన గురి చేస్తోంది. డెల్టా వేరియంట్‌తోనే తలమునకలైన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒమిక్రాన్ చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఇప్పుడు 57 దేశాలకు పాకింది. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగు చూసిన ఈ వేరియంట్ రోజురోజుకు వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,701 ఒమిక్రాన్…
కరోనా మహమ్మారి ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వేరియంట్ ఇప్పటికే భారత్‌లో ప్రవేశించేసరికి విమాన ప్రయాణాలపై ఆంక్షాలు విధించారు. అంతేకాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి గత నెలలో వచ్చిన వారిని ట్రేసింగ్ చేసి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఉమిలాడా గ్రామంలో అర్జాల గోపాల కృష్ణ (51) అనే వ్యక్తి గత నెల 23న…
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలో థర్డ్ వేవ్‌కి దారితీస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే పదిహేడు కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి వచ్చిన రాంచీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తి కొత్త మహమ్మారి బారిపడ్డాడు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ అతనికి ఒమైక్రాన్ సోకింది. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స పొందుతున్నాడు. జైపూర్‌లో తొమ్మిది ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.…
యావత్తు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. మొన్నటివరకు కరోనా డెల్టా వేరియంట్‌తో సతమతమైన ప్రజలు ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ పేరు చెబితే భయాందోళనకు గురవుతున్నారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తించెందుతుండడంతో ఇప్పటికే ఈ వేరియంట్ పలు దేశాలకు వ్యాప్తి చెందింది. భారత్‌లోనూ ఇటీవల ఎంటరైన ఈ ఒమిక్రాన్ వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా రాజస్తాన్‌లో 9 ఒమిక్రాన్…
ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలను మరోసారి భయాందోళనకు గురి చేస్తోంది. డెల్లా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే ఈ డేంజరస్ వైరస్ భారత్‌లోకి కూడా ఎంటరైంది. అయితే నిన్నటి వరకు కర్ణాటకలో 2, గుజరాత్‌లో 1, మహారాష్ట్రలో 1, ఢిల్లీలో 1 చొప్పున మొత్తం దేశవ్యాప్తంగా…
తెలంగాణలో ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని… తెలంగాణ వైద్య శాఖ ప్రకటన చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపింది. ఈ రోజు సాయంత్రం వరకు జీనోమ్ సిక్వెన్స్ ఫలితాలు వచ్చే అవకాశమని.. తెలంగాణ వైద్య శాఖ పేర్కొంది. ఈ మహమ్మరిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని.. హైదరాబాద్ లో రేపో మాపో కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది వైద్యశాఖ.…