సుంకాలను ఏకపక్షంగా పెంచే ఏ చర్యకైనా బ్రెజిల్ ఆర్థిక చట్టం ప్రకారం ప్రతిస్పందించబడుతుంది అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో యూఎస్ వస్తువులపై బ్రెజిలియన్ సుంకాలు విధించవచ్చని సంకేతాలు ఇచ్చింది. అలాగే, బ్రెజిల్ యొక్క స్వేచ్ఛా పూరిత ఎన్నికలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై అమెరికన్లు కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని లూయిజ్ ఇన్సియో ఆరోపించారు.
Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారోకు సపోర్టుగా.. ఆ దేశంపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్టన్లు ప్రకటించారు. బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసుపై తీవ్ర విమర్శలు చేశారు.