Illegal Affair Murder: మరికొన్ని రోజుల్లో మానవ సంబంధాలు ఉండవేమో అనేలా ప్రస్తుతం అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పరాయి వారికోసం సొంతవారినే కదా తీర్చే ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. భర్తను భార్య, తల్లితండ్రులను కన్నా బిడ్డలే ఇలా సొంతవారిని కదా తేరుస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా ఇలాంటి మరొక ఘటన హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రినే హత్య చేసింది కూతురు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు తల్లి కూడా సహకరించడం. తల్లితో పాటు ప్రియుడిని కలుపుకొని ఈ ఘోరానికి పాల్పడింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేసి చేతులు దులుపుకునే ప్రయత్నామ్ చేసారు. కానీ, చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. ప్రస్తుతం ఈ అమానుష ఘటన ట్రెండ్ అవుతుంది.
మృతుడు వడ్లూరి లింగం (45) పాతబస్తీలోని ఓ అపార్టుమెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారి పెద్ద కూతురు మనీషాకు పెళ్లి అయింది. అయితే, మనీషా భర్త స్నేహితుడు మహ్మద్ జావీద్ తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయటపడ పడడంతో భర్త ఆమెను వదిలేశాడు. ఇక అప్పటి నుండి ఆమె ప్రియుడితో కలిసి మౌలాలీలో సంసారం కొనసాగిస్తోంది.
Read Also:Earthquake: ఢిల్లీలో నిమిషం పాటు భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు
అయితే వీరి సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తండ్రి, పలుమార్లు కూతురిని మందలించాడు. ఇదే విషయాన్ని తన తల్లి శారదతో కూతురు చెప్పగా.. తండ్రి అడ్డు తొలగించుకుంటే వారి జీవితం సాఫీగా సాగుతుందని భావించి తల్లీకూతుళ్లు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ లో భాగంగా మహ్మద్ జావీద్‌తో కలిసి తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో జూలై 5న తండ్రి తాగే కల్లులో నిద్రమాత్రలు కలిపారు. ఇక నిద్రమాత్రలు కలిపిన కల్లు తాగాముతో నిద్రలోకి జారుకున్న తండ్రి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేశారు. అలా చేసిన మరణించకపోవడంతో ఛాతిపై పిడిగుద్దులు బలంగా గుద్దారు. అదికూడా సరిపోక చివరికి తాడుతో ఉరి బిగించి హత్య చేశారు.
ఇక హత్య అనంతరం ముగ్గురు కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత క్యాబ్ మాట్లాడుకుని మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో.. క్యాబ్ డ్రైవర్ కు అనుమానం వచ్చింది. అయితే అతడికి కల్లు తాగి మత్తులో ఉన్నాడని చెప్పి మోసగించారు. అలా అతడిని ఎదులాబాద్ వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత చెరువులో మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత జూలై 7న స్థానికులు చెరువులో ఉన్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
Read Also:RashiSingh : రాసులు పొదిగిన రాసి సింగ్ హాట్ ఫొటోస్
ఇక పోలీసుల విచారణలో భాగంగా.. సీసీ కెమెరాల ఫుటేజీలలో హత్య వెనుక దాగి ఉన్న విషయాన్నీ బయటపెట్టారు. కారు ఎక్కించే సమయంలో క్యాబ్ డ్రైవర్ ఉన్న ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. హత్య జరిగిన పద్ధతి, ప్రణాళికను చేధించారు. చివరికి సాక్ష్యాలు చూపించగా ముగ్గురూ నేరాన్ని ఒప్పుకున్నారు. దీనితో తల్లీకూతుళ్లు, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.