గత నెలలో చైనా భారీ కవాతు నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో భారీ కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులను ప్రదర్శించింది. ప్రపంచానికి ఒక సందేశం పంపించేందుకు చైనా ఈ ప్రదర్శన చేపట్టింది.

తాజాగా ఉత్తర కొరియా కూడా భారీ ఆయుధ కవాతు నిర్వహించింది. త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కిమ్ కూడా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. శుక్రవారం ప్యోంగ్యాంగ్లో పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 80వ వార్షికోత్సవం సందర్భంగా భారీ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో కిమ్ తన ఆత్మవిశ్వాసాన్ని చూపించారు. సంవత్సరాల తరబడి ఒంటరితనం, ఆంక్షల తర్వాత ప్రపంచ వేదికపై ఉత్తర కొరియా శక్తిని ప్రదర్శించేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది.

ఈ ప్రదర్శనలో చైనా, రష్యా, వియత్నాంలకు కిమ్ ఆతిథ్యం ఇచ్చారు. అత్యంత సీనియర్ చైనా అధికారి కియాంగ్, మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ నేతృత్వంలోని రష్యన్ ప్రతినిధి బృందం, దాదాపు 20 సంవత్సరాల్లో ప్యోంగ్యాంగ్ను సందర్శించిన మొట్టమొదటి అగ్ర నాయకుడు, వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ లామ్, లావోస్ అధ్యక్షుడు థాంగ్లౌన్ సిసౌలిత్ పాల్గొన్నారు.

ఓ వైపు ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా కూడా యుద్ధం చేస్తోంది. ఇంకోవైపు చైనా-అమెరికా మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కిమ్ తన శక్తిని ప్రపంచానికి చూపించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Taliban-Priyanka Gandhi: మహిళా జర్నలిస్టులను ఎందుకు పిలువలేదు.. కేంద్రంపై ప్రియాంకాగాంధీ ధ్వజం
దక్షిణ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ ఈనెలలో రానున్నారు. ట్రంప్ మొదటి విడత పరిపాలనలో కిమ్ కలిశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కిమ్ ఇప్పటి వరకు కలవలేదు. ప్రస్తుతం కిమ్ చైనా, రష్యాతో కిమ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!