ఎలక్ట్రానిక్ కంపెనీలు టెక్నాలజీని యూజ్ చేసుకుని స్మార్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లు కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ఒకవైపు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు వాటి ప్రీమియం టెక్నాలజీ, ఫీచర్లకు ప్రసిద్ధి చెందగా, మరోవైపు, నేటికీ లక్షలాది మంది సరసమైన ఫీచర్ ఫోన్‌లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఫీచర్ ఫోన్‌లు కేవలం కాల్స్, మెసేజెస్ కు పరిమితం కాకుండా YouTube, OTT ప్లాట్‌ఫామ్, UPI చెల్లింపు వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అత్యంత చౌకైన…
ప్రముఖ టెక్ కంపెనీ నోకియా లేఆఫ్‌లు ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ 2000 మందిని తొలగించింది. గ్రేటర్ చైనాలో నోకియా ఈ తొలగింపును చేసింది. అంతకుముందు ఖర్చులను తగ్గించుకునేందుకు యూరప్‌లో 350 మందిని కంపెనీ తొలగించింది. యూరప్‌లో ఉద్యోగుల తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు.
Nokia 3210 Price in India: హెఎండీ గ్లోబల్ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌పై స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య వెనకపడిపోయిన నోకియా.. మళ్లీ పుంజుకునేందుకు చూస్తోంది. ఈ క్రమంలో మూడు కొత్త ఫీచర్ ఫోన్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత నోకియా 3210 మోడల్‌ను మళ్లీ తీసుకొచ్చింది. నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరిట మరో రెండు ఫోన్లనూ రిలీజ్ చేసింది. యూట్యూబ్, యూపీఐ ఫీచర్లతో ఈ…
Nokia 3210 4G Launched in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తన ‘నోకియా’ బ్రాండ్‌పై కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘నోకియా 3210 4జీ’ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల క్రితం (1999) లాంచ్ అయిన ఈ మోడల్.. మరోసారి నోకియా ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ ధరను రూ.3,999గా హెచ్ఎండీ గ్లోబల్ నిర్ణయించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, హెచ్‌ఎండీ ఈస్టోర్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు…
UPI Payment : ఇప్పటివరకు యూపీఐ చెల్లింపులు కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా మాత్రమే జరిగేవి. కానీ ఇప్పుడు ఈ సౌకర్యం ఫీచర్ ఫోన్‌లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే హెచ్ ఎండీ గ్లోబల్ తన కొత్త సరసమైన ఫీచర్ ఫోన్ నోకియా 105 క్లాసిక్‌ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.
Nokia: టెక్ రంగంలో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో మొదలైన ఈ తొలగింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు కంపెనీలు దశల వారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఖర్చలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
స్మార్ట్ఫోన్లు వచ్చిన దగ్గరి నుంచి కీప్యాడ్ మొబైల్ల డిమాండ్ తగ్గిపోయింది. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే కనపడుతున్నాయి. ఎక్కడో పల్లెటూర్లలో, స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడాలో తెలియని వాళ్ల దగ్గరే కీప్యాడ్ మొబైల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ వాడే వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. కీప్యాడ్ మొబైల్‌లపై పండగ ఆఫర్ సందర్భంగా కొన్ని మొబైల్ కంపెనీలు భారీగా ధరలు తగ్గిస్తున్నారు.
Nokia G42 5G Smartphone Launch and Price in India: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉంది. గతంలో నోకియా లేని వ్యక్తి ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. ఐఫోన్, శాంసంగ్, రెడ్‌మీ, ఒప్పో, మోటో ప్రభంజనంలో కనుమరుగయ్యిందనే చెప్పాలి. మరలా తన మార్కెట్‌ను దక్కించుకునేందుకు నోకియా ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్…
Nokia G42 5G Smartphone Launch and Price: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలోనే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా విడుదల చేయనుంది. నోకియా జీ42 5G (Nokia G42 5G) పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో వదలనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇటీవల గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ…
Nokia XR21 5G Launch 2023: గతంలో ‘నోకియా’ కంపెనీ మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో రకాల ఫోన్స్ రిలీజ్ చేసి కస్టమర్లను ఆకట్టుకుంది. అయితే షియోమీ, వివో, రియల్ మీ, సామ్ సంగ్, ఐఫోన్ లాంటి సంస్థలు రావడంతో నోకియా హవా పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ మార్కెట్‌లో తిరిగి నంబర్ వన్ అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. నోకియా కంపెనీ మేలో యూకేలో నోకియా ఎక్స్ఆర్21 (Nokia XR21)…