Nobel Peace Prize: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇరాన్ మానవహక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. తన దేశంలో మహిళలపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నారు. మహిళా హక్కుల కోసం నినదించిన నర్గేస్ మొహమ్మదీకి 2023 సంవత్సరానికి గానూ శాంతి బహుమతి ఇచ్చారు.
నర్గేస్ పోరాటం చాలా కష్టంతో కూడుకున్నదని, ఆమెను 13 సార్లు అరెస్ట్ చేశారు, ఐదుసార్లు దోషిగా నిర్దారించారు. మొత్తం 31 ఏళ్ల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించారని నోబెల్ ప్రైజ్ కమిటీ తన సందేశంలో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఎవిన్ జైలులో అనేక నేరాలకు శిక్షలను అనుభవిస్తున్నారు.
Read Also: Elections: తెలంగాణతో సహా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేది అప్పుడే.. వారంలోగా షెడ్యూల్..?
నర్గేస్ మొహమ్మదీ ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 1990 నుంచి ఆమె యాక్టివిస్ట్ గా ఉంది. ఫిజిక్స్ విద్యార్థిగా ఆమె సమానత్వం, మహిళల హక్కుల కోసం నినదించారు. జీవించే హక్కు కోసం పోరాడారు. మహిళల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ రైట్ ఇలా హక్కుల కోసం పోరాడారని కమిటీ వెల్లడించింది.
గతేడాది హిజాబ్ సరిగా ధరించనుందుకు అక్కడి మొరాలిటీ పోలీసులతో చేతిలో దెబ్బలు తిని మహ్సా అమిని అనే యువతి మరణించారు. ఇది ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్యమానికి కారణమైంది. ఈ ఉద్యమానికి నర్గేస్ మద్దతు ఇచ్చారు. కఠినమైన జైలు పరిస్థితుల నుంచి కూడా ఆమె బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ చేయగలిగారని, న్యూయార్క్ టైమ్స్ మహ్సా అమిని మరణ వార్షికోత్సవం సమయంలో వెలువరించిన కథనంలో పేర్కొంది.