Nikki Haley: గాజా ప్రాంతంలోని పాలస్తీనా పౌరులపై ఇస్లామిక్ దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నిక్కీహేలీ మండిపడ్డారు. ఇజ్రాయిల్-హమాస్ పోరులో ఇళ్లను విడిచివెళ్లిపోతున్న గాజా పౌరులకు ఆయా దేశాలు గేట్లు తెరవడం లేదని దుయ్యబట్టారు. గతంలో ఇరాన్ అణు ఒప్పందంపై మాజీ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహరించిన తీరును ఆమె ప్రశ్నించారు. ఇరాక్, హిజ్బుల్లా, హమాస్‌లను బలోపేతం చేశారని ఆరోపించారు.
పాలస్తీనా పౌరుల గురించి, ముఖ్యంగా అమాయకుల గురించి మనం పట్టించుకోవాలి ఎందుకంటే వారు సాయాన్ని అడగలేరు. అయితే అరబ్ దేశాలు ఎక్కడ ఉన్నాయని ఆమె ప్రశ్నించారు.ఇలాంటి సంక్షోభంలో ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్ ఎక్కడ ఉన్నాయని ఆమె అడిగారు. ఈజిప్టుకు అమెరికా ప్రతీ ఏడాది బిలియన్ డాలర్లను ఇస్తుందని మీకు తెలుసా..? వారు ఎందుకు గేట్లు తెరవడం లేదు, పాలస్తీనియన్లను ఎందుకు రానివ్వడం లేదని సీఎన్ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీహేలీ మండిపడ్డారు.
Read Also: Varun- Lavanya: వరుణ్-లావణ్య ప్రైవేట్ పార్టీ.. టాలీవుడ్ నుంచి ఆ ఒక్క హీరోకే పిలుపు?
హమాస్ లాంటి వారు తమ పొరుగున ఉండాలని వారు కోరుకోవడం లేదని ఇస్లామిక్ దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ కూడా ఇలాంటి వారు తమ పక్కలో ఉండాలని ఎందుకు కోరుకుంటుందని ప్రశ్నించారు. పాలస్తీయన్లు అరబ్ దేశాలు నమ్మడం లేదని, వీరిలో ఎవరు మంచి వారు, ఎవరు చెడ్డవారో నమ్మలేకపోతున్నాయి. దీంతోనే వారు పాలస్తీయన్లను తమ దేశాల్లోకి అనుమతించడం లేదని అన్నారు.
అరబ్ దేశాలు హమాస్ ఇలాంటి పనులు మానేయాలని చెప్పే అవకాశం ఉంది కానీ, సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. కానీ వీరంతా అమెరికా, ఇజ్రాయిల్‌ని నిందించబోతున్నారు. వీళ్ల ట్రాప్ లో పడొడ్డని నిక్కీహేలీ అన్నారు. ఖతార్ హమాస్, వారి నాయకత్వానికి సాయం చేయబోతోంది. ఇరాక్ వీటన్నింటికి నిధులను ఇస్తోంది, అయినా వీరు ఏం మాట్లాడరని, ఇజ్రాయిల్, అమెరికా వైపు మాత్రం వేలెత్తి చూపుతారని అన్నారు. చిన్న పిల్లల్ని, గాజా ప్రజలను మానవ కవచాలుగా ఉపయోగించుకుని హమాస్, వారు చనిపోయిన తర్వాత ఫోటోలు విడుదల చేసి ఇజ్రాయిల్ పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. హమాస్ ఇజ్రాయిల్ లో చేసిన మారణకాండను మరిచిపోవద్దని, ఊయలలో ఉన్న చిన్నారులను కూడా చంపేశారని ఆమె అన్నారు.